తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటుతా
-తెలంగాణ ఆవశ్యకతపై ప్రాజెక్టు రిపోర్టు
-ఆత్మహత్యల నివారణకు పరిశోధన
-అమెరికన్ రీసెర్చ్ స్కాలర్ డోన్నా రెన్
కరీంనగర్, ఆగస్టు 10(టీ న్యూస్): తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటుతానని అమెరికాకు చెందిన రీసెర్చ్ స్కాలర్ డోన్నా రెన్ వెల్లడించారు. కరీంనగర్‌కు చెందిన సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ జి.కుమారస్వామి ఆహ్వానం మేరకు తెలంగాణ ఆవశ్యకతపై అధ్యయనం చేసేందుకు ఆమె కరీంనగర్‌కు వచ్చారు. జర్నలిజం, బ్రాడ్‌కాస్టింగ్, పబ్లిక్‌రిలేషన్స్, కల్చరల్‌లో బీజింగ్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్‌గా పనిచేశారు. బుధవారం ఉదయం వరంగల్ జిల్లాలోని కొముర మల్లికార్జున స్వామిని దర్శించి అక్కడ కళాకారుల ప్రదర్శనను తిలకించారు. మధ్యాహ్నం గంగాధరలోని బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతిమ మల్టీప్లెక్స్‌లో ‘టీ న్యూస్’తో మాట్లాడుతూ 2012లోపు రాష్ట్ర ఆవశ్యకతపై ప్రాజెక్టును తయారుచేసి ప్రపంచానికి ఇక్కడి ప్రజల ఆకాంక్షను తెలిజేస్తానని చెప్పారు. ఆత్మహత్యల నివారణకు పరిశోధన చేస్తానని తెలిపారు. ఇక్కడి ప్రజలను దగ్గరి నుంచి పరిశీలించాను, ముంబై, వారణాసిలా అనిపించలేదు, ఇక్కడి ప్రజలు పెదాలతో మాట్లాడరు, మనసుతో మాట్లాడుతారని కితాబు ఇచ్చారు.
సీఎన్‌ఎన్ చానల్‌లో పనిచేశానని, బీబీసీ వారితో మాట్లాడి తెలంగాణపై లోతుగా అధ్యయనం చేసి డాక్యుమెంటరీతో ప్రపంచానికి తెలియజేస్తానని చెప్పారు. శుక్రవారం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలుసుకుంటానని తెలిపారు. తెలంగాణకు రెన్‌ను ఆహ్వానించిన కుమారస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం కూడా ఆమె సేవలు వినియోగించుకుంటామన్నారు.
No comments:
Post a Comment